రామోజీ గ్రూప్ లలో ఒకటైన ఈనాడు కు చెందిన ఈనాడు జర్నలిజం స్కూల్ కు బయిట మీడియా వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈనాడు జర్నలిజం స్కూల్ లో చదివి, అక్కడ పనిచేసినవారు..అద్బుతమైన జర్నలిస్ట్ లుగా రాణిస్తారని ఈ రోజు మీడియా టాప్ పొజీషన్స్ లో ఉన్న ఉద్యోగులే నిదర్శనం. జర్నలిజం అంటే ఆసక్తి ఉండి, రాయగలిగి ఉండేవారికి ఇప్పుడు మళ్లీ జర్నలిజం స్కూల్ అటువంటి అవకాసం కల్పిస్తోంది. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేసారు.
అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే ఈనాడు జర్నలిజం స్కూల్ సువర్ణావకాశం కల్పిస్తోంది. మల్టీమీడియా, టెలివిజన్ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. సామాజిక చైతన్యం, తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టు ఉన్న డిగ్రీ అభ్యర్థులు ఈ పరీక్షకు సిద్ధం కావచ్చు. పూర్తి ప్రకటన పాఠం ఇక్కడ మీరు చూడవచ్చు.
comments